తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్..

భారత దేశంలో అత్యంత ప్రసిద్దిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ టీటీడీకి ప్రతి రోజు వేలాది సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు.

Update: 2025-04-08 03:23 GMT
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో అత్యంత ప్రసిద్దిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఒకటి. ఈ టీటీడీ (TTD)కి ప్రతి రోజు వేలాది సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. పండుగలు, వీకెండ్, హాలీడే సందర్భాల్లో తిరుమల (Tirumala)కు భక్తులు పోటెత్తుతుండగా.. సాధరణ సమయాల్లో భక్తుల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో శని, ఆది, సోమవారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండగా.. ఈ రోజు దగ్గింది. దీంతో తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy)వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.

ఇదిలా ఉండగా.. సోమవారం రోజు స్వామివారిని 66,503 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 23,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే టీటీడీ (TTD)కి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చి చేరింది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల టీటీడీ(TTD) వివిధ ట్రస్టులకు భువనేశ్వర్‌కు చెందిన దాతలు రూ. కోటి విరాళం(Donation) అందజేశారు. ఇందులో స్విమ్స్‌(Swems)కు రూ.40 లక్షలు, గోసంరక్షణ ట్రస్ట్(Cow Protection Trust)కు రూ.30 లక్షలు, అన్నప్రసాదం(Annaprasadam) ట్రస్టుకు రూ. 20 లక్షలు, సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం ఇచ్చారు.

Similar News