CM Revanth: రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే!
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు విజయవాడ (Vijayawada)కు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు విజయవాడ (Vijayawada)కు వెళ్లనున్నారు. ఇటీవలే టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ కుమారుడి వివాహానికి హాజరుకావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు రేపు జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని తన నివాసం నుంచి ఆయన రోడ్డు మార్గాన విజయవాడ (Vijayawada)కు వెళ్లనున్నట్లుగా సమాచారం. ఈ వివాహ వేడుకకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), తదితరులు హాజరుకాబోతున్నట్లుగా తెలుస్తోంది.