దిమ్మ తిరిగిపోయే ఘటన.. సినిమా ట్విస్టులకు ఏ మాత్రం తగ్గదు

సినిమా రేంజ్ ట్విస్టులకు ఏ మాత్రం తగ్గని క్రైమ్ సంఘటన ఇటీవల ఒంగోలు పట్టణంలో చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకే షాక్ తగిలే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2025-01-01 03:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమా రేంజ్ ట్విస్టులకు ఏ మాత్రం తగ్గని క్రైమ్ సంఘటన ఇటీవల ఒంగోలు పట్టణంలో చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకే షాక్ తగిలే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు(Ongol) పట్టణంలో స్పా సెంటర్(Spa center) నిర్వహిస్తున్న శ్యామ్ అనే వ్యక్తి.. దుర్బుద్దితో.. తన స్పా కి వచ్చే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో.. స్పా సెంటర్ కు వచ్చిన ఓ విటుడిని తన సిబ్బందితో న్యూడ్ ఫోటోలు తీయించుకున్నాడు. అనంతరం నకిలీ పోలీస్ టీమ్(Fake Police Team) తో రైడ్ చేయించాడు. ఆ తర్వాత విటుడి నుంచి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. అయితే విటుడు వద్ద.. అంత మొత్తం డబ్బు లేదని తేల్చి చెప్పడంతో.. కనీసం రూ.3 లక్షలైనా ఇవ్వాలని బెదిరించారు. అయితే సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. స్పా సెంటర్ నిర్వహకుడు.. శ్యామ్‌తో పాటు అండ్ నకిలీ పోలీస్ టీమ్ ను అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నకిలీ పోలీస్ టీమ్ యూనిఫామ్ తో స్వాధీనం చేసుకొని.. ఎప్పటి నుంచి ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.


Similar News