ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం ఫర్ది పేట చోటుచేసుకుంది.

Update: 2025-01-03 16:25 GMT

దిశ, మాచారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం ఫర్ది పేట చోటుచేసుకుంది. గోదూరి బాలయ్య (66) అనే వృద్ధుడు గురువారం కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రోజంతా వెదికారు. పరిధిపేట్ గ్రామంలోని బండారి చెరువులో బాలయ్య శవం కనిపించింది. బాలయ్య కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉంటాడని భావించారు. మృతుని కొడుకు గోధూరి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.


Similar News