ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది.
దిశ, కొత్తగూడెం రూరల్: ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన రాంపవర్(18) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.