రామంతాపూర్ లో దారుణ హత్య

రామంతాపూర్ లో వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.

Update: 2025-01-03 15:22 GMT

దిశ, ఉప్పల్ : రామంతాపూర్ లో వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గోల్నాకకు చెందిన మొహమ్మద్ నబి (30) రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్ లో టెంట్ హౌస్ లో పనిచేస్తున్నాడు. ఇతడిని కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపి బాలకృష్ణ నగర్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల సమయంలో పడేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గతంలో అంబర్పేట్ లో జాకీర్ హుస్సేన్ మర్డర్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News