అనుచిత పోస్టుపై పోలీసులకు ఫిర్యాదు
సిరిసిల్ల టౌన్ బీజేపీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై తంగళ్లపల్లి మండలం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్ ఆధ్వర్యంలో శుక్రవారం తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ కు ఫిర్యాదు చేశారు.
దిశ, తంగళ్లపల్లి : సిరిసిల్ల టౌన్ బీజేపీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై తంగళ్లపల్లి మండలం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్ ఆధ్వర్యంలో శుక్రవారం తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు చేరుకొని మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదీనా మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండీ. కాశీం, ఎండీ.హైదర్, ఎండీ. గౌసుద్దీన్, మౌలానా షేక్, అక్రం రాజా, ఎండీ. ఖాలిద్ ఎండీ. ఇమామ్, ఎండీ. సలీం, ఎండీ. జానీ, ఎండీ.రఫిక్, ఎండీ.సలీం అన్ని గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.