పేకాట స్ధావరంపై పోలీసుల దాడి
కారేపల్లి మండలం మంగళితండా సమీపంలో పేకాట స్ధావరంపై శుక్రవారం కారేపల్లి పోలీసులు దాడి చేశారు.
దిశ, కారేపల్లి : కారేపల్లి మండలం మంగళితండా సమీపంలో పేకాట స్ధావరంపై శుక్రవారం కారేపల్లి పోలీసులు దాడి చేశారు. మంగళితండా సమీపంలో చెరువు వద్ద పేకాట అడుతున్నారని సమాచారంతో పోలీసులు దాడి జరపగా పిల్లలమర్రి వెంకటేష్, దారావత్ చంటి, దారావత్ గాంధీ, వాంకుడోత్ వీరన్నలను అదుపులోకి తీసుకోగా బాలకృష్ణ, బాబురావు లు పరారయ్యారు. వారి వద్ద నుండి 4 సెల్ పోన్లు, రూ. 2020 నగదు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.