ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి

వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట శవంతో ఆందోళన నిర్వహించారు

Update: 2025-01-03 16:50 GMT

దిశ, పరిగి : వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట శవంతో ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని సాధన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. దోమ మండలం గూడూరు గ్రామానికి చెందిన వడ్డే యాదమ్మ 31వ తేదీన గర్భసంచి సమస్య తో సాధన ఆసుపత్రికి వచ్చింది. జనవరి 1 తేదీన యాదమ్మకు ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ నిర్వహించిన మరుసటి రోజు అటెండర్ సహాయంతో యాదమ్మను నెమ్మదిగా ఆసుపత్రిలో నడిపించారు.

అలా రెండో రోజు శుక్రవారం ఉదయం కూడా యాదయ్యమ్మను నడిపిస్తూ అటెండర్ అజాగ్రత్తగా వ్యవహరించడంతో వెనకాలకు కింద పడిపోయింది. అపస్మారక స్థితికి చేరుకున్న యాదమ్మను ఆసుపత్రి అంబులెన్స్ లో వెంటనే వికారాబాద్ కి తరలించారు. వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా యాదమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు సాధన ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే యాదమ్మ మృతి చెందిందని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పరిగి సంతోష్ కుమార్ అస్పత్రి కి వెళ్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. కుటుంబీకులను శాంతింప చేసి, ఫిర్యాదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Similar News