Hema Drug Case: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమకు ఊరట

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో (Hema) నటి హేమకు ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసు పై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది

Update: 2025-01-02 08:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో (Hema) నటి హేమకు ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసు పై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే హేమా తనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించి.. విచారణపై స్టే కోరుతూ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ (ఐఏ) ను అనుమతిస్తూ విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇచ్చింది.

కాగా, గత ఏడాది బెంగళూరులో రేవ్‌ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలడం కలకలం రేపింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్న విషయం తెలిసిందే. తాను రేవ్ పార్టీకి పోలేదని హేమ ఓ వీడియో రిలీజ్ చేయడంతో.. ఆమె ఫొటోను బెంగళూరు పోలీసులు విడుదల చేశారు. కృష్ణవేణి పేరుతో నటి హేమ పార్టీకి హాజరైనట్లు తెలిపారు. పోలీసు రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేశారు. అప్పటికే బెంగళూరు పోలీసులు ఆమె పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె కేసు కొట్టివేయాలని బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. గురువారం న్యాయం స్థానం స్టే విధించడంతో కేసులో ఊరట లభించినట్లైంది.

Tags:    

Similar News