Suryapet Collector : ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఎలాంటి

Update: 2024-09-16 15:51 GMT

దిశ,సూర్యాపేట కలెక్టరేట్ : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న వేడుకలకు షెడ్యూల్ ప్రకారం వేడుకలు నిర్వహణ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ,చైర్మన్ జి. నిరంజన్ ను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథిచే జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 9 గంటలకు ఐడీఓసీ కార్యాలయానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.


Similar News