చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు

చింతపల్లి మండల కేంద్రంలో పశువైద్యాధికారి గా విధులు నిర్వహిస్తున్న జిజే పాల్ రూ. 6000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Update: 2024-09-30 10:00 GMT

దిశ, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలో పశువైద్యాధికారి గా విధులు నిర్వహిస్తున్న జిజే పాల్ రూ. 6000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నసర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు గేదెల బ్యాంకు లోన్(పదిలక్షల) కొరకు.. హెల్త్ సర్టిఫికెట్ అవసరం పడింది. కాగా ఆ రైతు వాటి హెల్త్ సర్టిఫికెట్ కోసం చింతపల్లి మండల కేంద్రంలో పశువైద్యాధికారి వద్దకు వెళ్లాడు. అయితే రైతుకు హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.  8 వేల లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు తన దగ్గర 8,000 లేవని.. రూ 6 వేలు మాత్రమే ఉన్నాయని చెబుతూ.. లంచం డబ్బులు పశు వైద్యాధికారి జిజే పాల్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో రూ. 6000 లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ రైడ్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర, ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు పాల్గొన్నారు.


Similar News