శబరిమల వెళ్తున్న కారు ఢీకొన్న బైక్.. ఒకరికి తీవ్ర గాయాలు
శబరిమల వెళ్తున్న కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, గరిడేపల్లి: శబరిమల వెళ్తున్న కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఆప్పన్నపేట గ్రామానికి చెందిన యరగొర్ల మదార్ పని నిమిత్తం తన బైక్ పై బయటకు వెళ్లి..తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా మేళ్లచెరువు నుంచి శబరిమలైకి వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు మదార్ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో మదార్ కి తీవ్ర గాయాలు కాగా..ఇది గమనించిన స్థానికులు,కుటుంబ సభ్యులు లో మదార్ ను ఆస్పత్రికి తరలించారన్నారు.