కొలనుపాక శివారులో అలరించిన జింక..

ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ శివారులోని రాఘవాపురం కుశెంగుల మల్లన్న గుడి ప్రాంతంలోని వ్యవసాయ బావుల వద్ద బంగారు వర్ణం గల లేడీ జింక ఒకటి ఆదివారం "దిశ" కు సంచరిస్తూ తారసపడ్డది.

Update: 2024-12-02 05:46 GMT

దిశ, ఆలేరు : ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ శివారులోని రాఘవాపురం కుశెంగుల మల్లన్న గుడి ప్రాంతంలోని వ్యవసాయ బావుల వద్ద బంగారు వర్ణం గల లేడీ జింక ఒకటి ఆదివారం "దిశ" కు సంచరిస్తూ తారసపడ్డది. ఈ విషయమై ఆ ప్రాంత రైతులను "దిశ " అడగగా గత 10 సంవత్సరాల క్రితం ఒక చిన్నపిల్ల (జింక) తప్పిపోయి ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. నాటి నుంచి పశువులతో మమేకమై వాటితో కలియ తిరుగుతుందని, పొద్దున నుండి సాయంత్రం వరకు పశువులు మేతకు వెళ్ళినప్పటి నుంచి వాటితో కలిసి తిరుగుతూ, సాయంత్రం పశువులతో తిరిగి వచ్చే వ్యవసాయ బావుల వద్దే పశువులతో వుంటుందని రైతులు "దిశ"కు తెలిపారు.

 జింకను సంరక్షించాలి..

వ్యవసాయ పొలాల్లో ప్రజానివాసాలకు అతి సమీపంలో పశువులతో కలియ తిరుగుతున్న లేడీ జింకను అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి లేడి జింకను పట్టుకొని సంరక్షించాలని, అక్రమార్కుల కంటపడితే లేడి జింక ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని, జంతు ప్రేమికులు అటవి శాఖ అధికారులను కోరుతున్నారు.


Similar News