అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న అతిథి

Update: 2024-12-02 10:56 GMT

దిశ,తిరుమలగిరి (సాగర్) : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ఎస్ఓ ఎం.కవిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ సీఆర్టీ,పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఎంపికైన వారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు రెండు రోజుల్లో తిరుమలగిరి కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.


Similar News