కోదాడ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం : మంత్రి ఉత్తమ్

డబుల్ రోడ్డు తో పాటు ఇంటర్నల్ సిమెంట్ రోడ్ల నిర్మాణం రూ.25 కోట్లతో

Update: 2024-12-02 09:45 GMT

దిశ,మోతే: డబుల్ రోడ్డు తో పాటు ఇంటర్నల్ సిమెంట్ రోడ్ల నిర్మాణం రూ.25 కోట్లతో చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, ప్రజల సౌకర్యార్థం సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తానన్నారు. రైతుల కొరకు అన్ని లిఫ్టులు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

40 కోట్లతో రెడ్డి గుంటకు లిఫ్ట్ మంజూరు చేశామన్నారు. సాగునీటికి,త్రాగు నీటికి,విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సామాన్యులకు అనుకూలంగా అన్ని వసతులు కలిపిస్తూ.. సంవత్సర పాలనలో 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి చేసి చూపించమన్నారు. కాళేశ్వరం ద్వారా నీటి చుక్క రాకపోయినా..ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో 45 లక్షల మంది రైతులు 1503 లక్షల మెట్టు వరి ధాన్యాన్ని పండించారన్నారు. దేశంలో ఎక్కడ ఇంత పంట రాలేదని, సన్నాలకురూ. 500 ల బోనస్ అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం..ఆరు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత రైతు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మిస్ చార్జీలు, డైట్ చార్జీలు పెంచమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, మాజీ శాసనసభ్యులు వి చందర్రావు, ఆర్డిఓ వేణుమాధవ్, ఏసీపీ నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి ఈ ఈ సీతారామయ్య, మోతే తాసిల్దార్ ఎస్ సంఘమిత్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News