ఫీజు బకాయిలు 7 వేల కోట్లు.. వెంటనే విడుదల చేయాలి

విద్యార్థులకు ప్రభుత్వం బకాయిలు 7 వేల కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రాందేవ్ డిమాండ్ చేశారు.

Update: 2024-11-11 13:36 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్ : విద్యార్థులకు ప్రభుత్వం బకాయిలు 7 వేల కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రాందేవ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గాంధీ పార్క్ వద్ద సోమవారం నిర్వహించిన విద్యార్థి సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు బకాయిలు ఫీజులు విడుదల చేయడం చేతగాని ఈ ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు రూ. 1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. విద్యా శాఖకు మంత్రిని నియమించకపోవడంతో.. సమస్యలు పరిష్కరించే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు కరవై ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 75 మంది విద్యార్థులు చనిపోయినా ..ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే సీఎం ఇంటిని ముట్టడించి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం కన్వీనర్ ఎడ్ల మహాలింగం, హరికృష్ణ, వీరేందర్, మహదేవ్, నిఖిల్, భాస్కర్, మణికంఠ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News