నల్గొండ మున్సిపాలిటీ కి రూ. 25 లక్షల రూపాయలు ప్రోత్సాహకం

నల్గొండ మున్సిపాలిటీ దేశంలోనే మూడు లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీ ల మీద పర్యావరణం, అటవీ,

Update: 2024-09-07 11:25 GMT

దిశ, నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ దేశంలోనే మూడు లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీ ల మీద పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నిర్వహించబడిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ లో 2024 లో 2వ స్థానం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పోటీలో 131 నగరాలు స్వీయ అంచనా నివేదికలు సమర్పించగా వాటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఎంపిక చేయడంతో పాటు ఈరోజు రాజస్థాన్ లోని జైపూర్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లో స్వచ్ఛ వై దివాస్ సందర్భంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి బజానా చేతుల మీదుగా 25 లక్షల రూపాయలు ప్రోత్సాహక బహుమతి తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ వాయు సర్వేక్షన్ క్రింద మున్సిపల్ ఖాతాలో రెండు కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అలాగే నేడు 25 లక్షల రూపాయల చెక్కు అందుకున్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. వారు మాట్లాడుతూ నల్గొండ కు ప్రథమ స్థానం అన్ని విభాగాల్లో వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.


Similar News