Mukkoti Ekadashi.. రాజన్నకు భక్తుల తాకిడి

వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Update: 2023-01-02 06:58 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామికి మహా హారతి అనంతరం కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు.

ఉదయమే ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతికి, శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవార్లకు, శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలతో అలంకరించిన అంబారి వాహనంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రాజ గోపురం ద్వారా ఉత్సవమూర్తులను బయటకు తీసుకువచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. 

Also Read...

నుమాయిష్ సందర్శకులకు గుడ్ న్యూస్

Tags:    

Similar News