కొత్త పార్లమెంట్ భవనంలోనైనా ఆ పని చేయాలి: ఎమ్మెల్సీ కవిత డిమాండ్

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-18 14:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉందని.. నూతన పార్లమెంట్ భవనంలోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లుకు మద్దతు తెలపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కవిత లేఖను సైతం రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు చేస్తోందని.. ఈ నెల 20వ తేదీన పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఫన్నీగా ఉన్నాయన్నారు. ఎన్ని మాటలు చెప్పిన విశ్వాసమున్న నేతలు, పార్టీలనే ప్రజలు నమ్ముతారని అన్నారు.

Tags:    

Similar News