MLC Deshapati Srinivas : అర్భకులు.. బుల్డోజర్ బుల్లోళ్ళు : సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ దేశపతి విసుర్లు
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరో అర్భకులు(Arbhakulu)..బుల్డోజర్ బుల్లోళ్ళు(Bulldozer Childrens)వచ్చి కేసీఆర్(KCR) ను విమర్శిస్తూ మాట్లాడితే పట్టించుకోనవసరం లేదంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(BRS MLC Deshapati Srinivas) విమర్శలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరో అర్భకులు(Arbhakulu)..బుల్డోజర్ బుల్లోళ్ళు(Bulldozer Childrens)వచ్చి కేసీఆర్(KCR) ను విమర్శిస్తూ మాట్లాడితే పట్టించుకోనవసరం లేదంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(BRS MLC Deshapati Srinivas) విమర్శలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంపై దేశపతి మాట్లాడారు. చరిత్రలో రాజకీయాలపై ఉండే విశ్వాసాన్ని కాంగ్రెస్ విధ్వంసం చేసిందని, అలాంటి సమయంలో ఆ విశ్వాసాలకు, అమరుల ఆశయాలకు అమృత స్పర్శగా, సంజీవనిగా కేసీఆర్ వచ్చారని అన్నారు.
2001ఏప్రిల్ 27న ఆమరుల ఆశయాలు పునరుత్థానమైన రోజు అన్నారు. 1969తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆశయాలు బాంబుల్లా నిక్షిప్తమైపోగా..కేసీఆర్ ప్రళయ గర్జనలో అమరుల ఆశయాలు విస్ఫోటనం చెందాయన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ పైన, ఆయన చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపైన, తెలంగాణ పునర్ నిర్మాణానికి పదేళ్ల పాటు చేసిన కృషిపైన రేవంత్ రెడ్డి వంటి వారు చేసే విమర్శలకు విలువలేదన్నారు. ఈరోజు తెలంగాణ తల్లిని ఎవరైనా పెట్టొచ్చని, కాని వేయి పడగల నాగు వంటి సమైక్యాంధ్రులను ఎదురించి... తెలంగాణ తల్లికి దేవతలా రూపం ఇచ్చి, బంజరాహిల్స్ లో ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించటం గొప్ప అని, అది కేసీఆర్ చేశారని కొనియాడారు.