MLA Kunamneni: ప్రతిపక్షం అంటే తిట్లు, శాపనార్థాలు కాదు.. ఎమ్మెల్యే కూనంనేని హాట్ కామెంట్స్

ప్రతిపక్షం అంటే తిట్లు, శాపనార్థాలు కాదని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Samba Siva Rao) అన్నారు.

Update: 2024-12-03 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షం అంటే తిట్లు, శాపనార్థాలు కాదని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Samba Siva Rao) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్‌ (Congress) పాలనపై ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తొలి ఏడాది 60 శాతం మార్కులతో పాస్ అయిందని కామెంట్ చేశారు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్‌ (BRS)తో పోల్చితే 90 శాతం మెరుగైన పాలన ఉందని తెలిపారు. ఒకవేళ సరైన రీతిలో పాలన కొనసాగించకపోతే ప్రజలే ఫెయిల్ మార్కులు వేస్తారని చురకలంటిచారు. ప్రతిపక్షం అంటే తిట్లు, శాపనార్థాలు కాదని.. ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితువు పలికారు.

Tags:    

Similar News