భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రులకు ఆహ్వానం

భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు మంత్రులకు ఆహ్వానం అందించారు.

Update: 2025-03-22 13:25 GMT
భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంత్రులకు ఆహ్వానం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: భద్రాచలం (Badrachalam) శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల (Srirama Navami Brahmosthavalu) సందర్భంగా ఆలయ అధికారులు మంత్రులకు ఆహ్వానం అందించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలం రాముల వారి సన్నిధిలో ప్రతీ ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వచ్చే నెల 6 నుంచి భద్రాద్రిలో సీతారాముల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీని కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు రావాలని అధికారులు (Temple Officials) పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు (Invitations) అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే శనివారం తెలంగాణ మంత్రులకు (Telangana Ministers) కూడా ఆహ్వానాలు అందించారు. భద్రాద్రి రాములవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు (Government Whip Beerla Ailaiah) కూడా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భద్రాచలం ఈవో రమాదేవి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ (MLA Thellam Venkat Rao) కూడా పాల్గొన్నారు.


Similar News