Crop Insurance : పంటల బీమాపై మంత్రి తుమ్మల సమీక్ష.. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు

పంటల బీమా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్ష నిర్వహించారు.

Update: 2024-09-14 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పంటల బీమా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పంటల బీమా, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపినట్లు తెలిసింది. రైతల ప్రయోజనాలకు అనుగుణంగా విధివిధానాలు రూపకల్పనపై చర్చలు జరిపినట్లు సమాచారం.

కాగా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నిన్న అలంపూర్ మర్కెట్ యార్డ్‌లో మాట్లాడారు. తెల్ల కార్డు లేని మూడు లక్షల మంది రైతులకు కూడా ఈ నెల చివరికి వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం అనేక నిబంధనలు పెట్టామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, రుణమాఫీ తర్వాత రైతు భరోసాను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.


Similar News