మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Sitakka) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు.

Update: 2024-12-04 07:35 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Sitakka) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న సీతక్క తన ట్వీట్ లో "ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వ్యక్తం చేసేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినాను. ఇది మన ప్రాంతాన్ని సాధికారం చేసే, అభివృద్ధిని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన నిర్ణయం" రాసుకొచ్చారు.


Similar News