Seethakka: కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు మంత్రి సీతక్క మరో కీలక హామీ
గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న రెన్యువల్ ఫైల్ (Renewal file) అంశంపై సోమవారం అసెంబ్లీలో సీఎం చాంబర్‌లో మంత్రి సీతక్క (Minister Seethakka) ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెన్యువల్ ఫైల్‌పై సంతకం పెట్టారు.
ఈ సందర్భంగా మంగళవారం ప్రజాభవన్‌లో తమ సేవలను రెన్యువల్ చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రి సీతక్కను కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (contract residential teachers) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క కీలక హామీ ఇచ్చారు.