ఉపాధి హామీ పథకంపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

ఉపాధి హామీ పథకంపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-07-19 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి హామీ పథకంపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ది, పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రత, ఉపాధి హామీ పనుల అమలుపై సమీక్ష నిర్వహించారు. అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులను నివారించేలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సరిగా విధులు నిర్వర్తించని ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వనమహోత్సవంలో ఫలసహాయం చేసే మొక్కలను నాటించాలన్నారు. రాష్ట్రంలో 30 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధం పనులను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలతో పంచాయతీ రాజ్ శాఖకి ఎంతో అనుబంధం ఉంటుందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, స్వచ్చదనం పెంచేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. 


Similar News