Minister Ponguleti: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తీరు సిగ్గుచేటు.. మంత్రి పొంగులేటి ఫైర్

రిజిస్ట్రేషన్ శాఖ (Registration Department)లో విచ్చివిడి అవినీతి తీరు సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-01-03 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజిస్ట్రేషన్ శాఖ (Registration Department)లో విచ్చివిడి అవినీతి తీరు సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ శాఖ (Registration Department)లో జరగుతోన్న అవినీతిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోకపోతే ఏసీబీకి వివరాలు పంపిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయితే.. మళ్లీ ఉద్యోగంలో చేరుతామని అనుకోవద్దని.. మళ్లీ విధుల్లోకి రాకుండానే చేస్తామని తేల్చి చెప్పారు. అదేవిధంగా అవినీతి సొమ్మును పూర్తిగా రికవరీ చేయిస్తానని అన్నారు. ఇక నుంచి ప్రతి నెలా విజిలెన్స్ నివేదికల ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.   


Also Read..

Missing: రాష్ట్రంలో మరో సంచలనం.. ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్సింగ్ 

Tags:    

Similar News