తిరిగి రాగానే అపోజిషన్‌కు బ్రేకింగ్ న్యూస్.. సియోల్ పర్యటనలో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టూర్ నుంచి తిరిగి రాగానే అపోజిషన్‌కు బ్రేకింగ్ న్యూస్ అంటూ షాకింగ్ హింట్ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. టూర్ నుంచి తిరిగి రాగానే అపోజిషన్(Telangana Opposition)కు బ్రేకింగ్ న్యూస్ అంటూ షాకింగ్ హింట్ ఇచ్చారు. ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసు సహా మరికొన్ని బాంబులు సిద్ధమని ప్రకటించారు. ప్రధాన నాయకులకు ఇది తప్పకుండా బిగ్ షాక్ అవుతుందని సియోల్ పర్యటన నుంచి తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచారు. ఆధారాలతో సహా అందరినీ బయటకు లాగుతామని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కమిషన్ రిపోర్ట్ కూడా అతి త్వరలో రాబోతోందని అన్నారు. కాగా, హైదరాబాద్‌లోని మూసీ నదిని ప్రక్షాళన అంశంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజధానీ నగరమైన సియోల్‌లో ప్రస్తుతం మంత్రులు, అధికారుల బృందం నాలుగు రోజులుగా పర్యటిస్తోంది. అక్కడ ప్రవహిస్తున్న హాన్, చియోంగ్‌చియాన్ నదులను పరిశీలిస్తున్నారు. ఈ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, అనుసరించిన విధానాలను తెలుసుకుంటున్నారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు.