TG Govt: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన
అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సభలో భూభారతి చట్టం(Bhu Bharathi Act) ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్(BRS) నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని ఆరోపించారు. భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ధరణి(Dharani)ని తమ ఇంటి సంస్థగా వాడుకుందని అన్నారు. భూభారతి చట్టం రూపకల్పనలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish), వినోద్(Vinod) లాంటి వాళ్ల సూచనలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు దోచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు.