కేసీఆర్‌ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు టాప్ లీడర్స్: మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నేత సింగిశెట్టి జగదీష్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నేత సింగిశెట్టి జగదీష్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగదీష్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అరాచక రాజకీయం జరుగుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటూ కాంగ్రెస్ ఆర్థిక తీవ్రవాదాన్ని నడిపిస్తోందని అన్నారు. తెలంగాణకున్న ఓకే ఒక గొంతుక కేసీఆర్‌ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచీ హైదరాబాద్ వస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓడించేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ నుంచి అగ్ర నేతలు వస్తున్నారు, ఇవన్నీ ప్రజలు గమనించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.