త్వరలోనే మహిళా విశ్వవిద్యాలయం: మంత్రి కొప్పుల
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయాన్ని త్వరలో నెలకొల్పనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయాన్ని త్వరలో నెలకొల్పనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. వారి భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి రూ.లక్షా 116, కేసీఆర్ కిట్ పేరుతో తల్లీబిడ్డలకు అవసరమయ్యే 16 రకాల వస్తువులు అందజేస్తున్నట్టు వివరించారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేల నగదు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లీ బిడ్డలను ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేర్చుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హెచ్‌పీసీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాపతి పాల్గొన్నారు.