Minister Komatireddy: కేటీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరు.. మంత్రి కోమటి‌రెడ్డి హాట్ సెటైర్లు

అమృత్ 2.0 టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం (State Government అవినీతి పాల్పడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-11-12 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమృత్ 2.0 టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం (State Government అవినీతి పాల్పడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో ప్రెస్‌మీట్ (Press Meet) నిర్వహించి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR) వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌(KTR)ను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరని సెటైర్లు వేశారు.

ఆయన నగరానికి తెచ్చింది ఒరిజినల్ ఫార్ములా-1 (Formula-1) కాదని ఫైర్ అయ్యారు. అమృత్ టెండర్ల (Amruth Tenders)లో అవినీతి జరిగిందని అనడం పెద్ద జోక్ అని అన్నారు. కేటీఆర్ (KTR) చెబుతున్న సృజన్ రెడ్డి (Srujan Reddy), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి తోక చుట్టమని అన్నారు. కవిత (Kavitha), సృజన్‌రెడ్డి (Srujan Reddy)లు వ్యాపార భాగస్వాములని.. పాలమూరు టన్నెల్ (Palamuru Tunnel) పనులను చేసింది వారేనని గుర్తు చేశారు. అందుకు కేటీఆరే (KTR) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో పాల్పడిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను వేగవంతం చేసిందని.. కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ (Governor) అనుమతి కోరుతూ లేఖ రాసిందని తెలిపారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ (BJP) నాయకులతో రహస్యంగా ములాఖత్‌ కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) క్రాస్ ఓటింగ్‌తో బీజేపీకి లాభం చేకూర్చిందని.. ఆ విషయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని కేటీఆర్ (KTR), బీజేపీ(BJP)తో టచ్‌లోకి వెళ్లారని కామెంట్ చేశారు. అమృత్ టెండర్ల (Amruth Tenders)లో అవినీతి ఆరోపణ ఉత్తదేనని ఆయన కోట్టి పడేశారు. రీటెండర్ ద్వారా ప్రభుత్వానికి మేలు జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.      

Tags:    

Similar News