'సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్ వన్'

Update: 2023-10-05 12:43 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ల మంజూరైన ఒక లక్ష 116 రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశంలోని అనేక రాష్ట్రాలలో అమలు అవుతున్నాయన్నారు.

పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పెన్షన్ క్రింద ప్రతినెల ఆర్ధిక సహాయాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సొంత ఇల్లు లేని పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తూ.. సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు కొలన్ లక్ష్మీ, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News