లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఏఎస్ఐ మధుసూదన్ రావు

మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు.

Update: 2024-10-07 15:51 GMT

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు దారుడు విశ్వనాథ్ ఇంటీరియర్ డిజైన్స్ చేస్తూ ఉంటాడు. శర్మ అనే ఓ వ్యక్తి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు ఒప్పుకున్నాడు. శర్మ నుంచి 4 లక్షల రూపాయలను ముందుగా తీసుకొని పనిని ప్రారంభించారు. పని పూర్తి కావాలంటే మరొక నాలుగు లక్షలు ఇవ్వాలని విశ్వనాథ్ అడిగాడు. పని పూర్తి చేయకుండానే డబ్బులు మొత్తం అడుగుతున్నాడని డబ్బులు ఇవ్వలేదని ఇంటికి తాళం వేశాడని శర్మ విశ్వనాధ్ పై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో గత రెండు నెలల క్రితం కేసు పెట్టారు. ఆ కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు విచారణ చేస్తున్నారు. విశ్వనాథ్ తనపై కేసు లేకుండా చూడాలని ఏఎస్ఐ ని కోరారు. అందుకు 2 లక్షల డబ్బులు ఇవ్వాలని ఏఎస్ఐ విశ్వనాథ్ కు సూచించాడు.

కేసు విచారణ చేపట్టిన మొదటి రోజు విశ్వనాథ్ దగ్గర నుండి పదివేల రూపాయలు ఏఎస్ఐ తీసుకున్నాడు. అనంతరం మరో 50 వేల రూపాయలు తేవాలని ఏఎస్ఐ విశ్వనాథ్ కు చెప్పాడు. దీంతో విశ్వనాధ్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏఎస్ఐ మధుసూదన్ రావుకు విశ్వనాథ్ సోమవారం నాడు వచ్చి కలుస్తానని చెప్పాడు. దాని ప్రకారం విశ్వనాథ్ మధుసూదన్ రావుకు 50 వేల రూపాయలను లంచంగా అందజేశాడు. విశ్వనాథ్ నుంచి 50 వేల రూపాయలు లంచంను మధుసూదన్ రావు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మధుసూదన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ఐ మధుసూదన్ రావును నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎవరు లంచం అడిగినా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ కోరారు.


Similar News