బాలానగర్ సీఐగా నర్సింహా రాజు బాధ్యతలు స్వీకరణ
బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా టి. నర్సింహా రాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు.
దిశ, కూకట్పల్లి: బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా టి. నర్సింహా రాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ను రాజేంద్రనగర్ డిఐగా, పేట్ బషీరాబాద్ డిఐగా విధులు నిర్వహిస్తున్న టి. నరసింహ రాజును బాలానగర్ సీఐగా బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నర్సింహా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు నేర సంబంధిత సేవలను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.