లైంగిక వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య
ఓ వివాహితుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, అల్వాల్: ఓ వివాహితుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లోతుకుంటలో నివాసం ఉండే ఓ మైనర్ బాలిక (17) పదవ తరగతి చదువుతుంది. స్థానికంగా ఉండే ఓ వివాహిత వ్యక్తి తనను ప్రేమించమని గత కొంత కాలంగా వేధిస్తుండడంతో వేధింపులు భరించలేక ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.