MLA : బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్​పల్లి రంగధాముని(ఐడిఎల్​) చెరువు కట్టపై సోమవారం జీహెచ్ఎంసీ, విద్యుత్​, పోలీస్​, జలమండలి అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2024-10-07 13:31 GMT

దిశ, కూకట్​పల్లి: బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్​పల్లి రంగధాముని(ఐడిఎల్​) చెరువు కట్టపై సోమవారం జీహెచ్ఎంసీ, విద్యుత్​, పోలీస్​, జలమండలి అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి  సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, చెరువు కట్టపై నిమజ్జనానికి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్​ దీపాలు, పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని, చెరువు కట్టపై ట్రాఫిక్​ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​లు శిరీష బాబురావు, ఆవుల రవీందర్​ రెడ్డి, డీసీ రమేష్​, ఈఈ శ్రీనివాస్​, డీఈఈ శ్రీదేవి, ఏఈ శ్రీనివాస్​, పారిశుద్ధ్య విభాగం అధికారి కార్తీక్​, విద్యుత్​ విభాగం డీఈఈ స్వప్న, జలమండలి జిఎం ప్రభాకర్​, మాజీ కార్పొరేటర్​ బాబురావు, తూము శ్రావణ్ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.


Similar News