నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
బస్సులో బంగారు ఆభరణాలు మరిచిపోయి దిగిపోయిన ప్రయాణికురాలి చిరునామా కనుక్కొని వారికి అప్పగించి కూకట్పల్లి ఆర్టీసి సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు.
దిశ, కూకట్పల్లి : బస్సులో బంగారు ఆభరణాలు మరిచిపోయి దిగిపోయిన ప్రయాణికురాలి చిరునామా కనుక్కొని వారికి అప్పగించి కూకట్పల్లి ఆర్టీసి సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. కూకట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికురాలు తన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయి వెళ్లిపోయింది.
అది గమనించిన డ్రైవర్ మధుబాబు, రాములు టికెట్ ఆధారంగా ప్రయాణికురాలి ఫోన్ నంబర్ కనుక్కొని సోమవారం డిపో మేనేజర్ హరి చేతుల మీదుగా ప్రయాణికురాలికి బంగారు ఆభరణాలు, 6700 రూపాయల నగదు ఉన్న బ్యాగును అప్పగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, టీఐ సావిత్రి, అరుణ, సీఐ ఏడీసీ చెన్నప్ప, ఎస్సై అన్వర్ ఖాన్, శ్రీనివాస్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.