'డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీతో నిరుపేదల కల సాకారం'

Update: 2023-10-05 13:54 GMT

దిశ, దుండిగల్: డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీతో నిరుపేదల కల సాకారమైయ్యిందని రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విలువైన స్థలాల్లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని.


అందులో భాగంగా నేడు లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల పంపిణి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్, మేడ్చెల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్.డి.ఓ శ్యామ్ ప్రసాద్, జోనల్ కమీషనర్ మమతా, నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్‌లు, కార్పొరేటర్‌లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News