నియోజకవర్గం అభివృద్దే లక్ష్యం
నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
దిశ, అల్వాల్ : నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితిని కలిసి పెండింగ్ లో ఉన్న ఫండ్స్ విడుదల చేయాలని కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ది పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందంగా తయారైందన్నారు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో అనేక అభివృద్ది పనులు కదలడం లేదని, నిధులు లేక అగిపోయాయని తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరం ఉన్న మేరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్ కిశోర్ గౌడ్, డోలీ రమేష్, విజయ శేఖర్ పాల్గొన్నారు.