బాధితులను హక్కు చేర్చుకుని వారిలో ధైర్యాన్ని నింపాలని : ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ

Update: 2025-03-18 14:04 GMT
బాధితులను హక్కు చేర్చుకుని వారిలో ధైర్యాన్ని నింపాలని : ఎస్పీ పరితోష్ పంకజ్
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భరోసా కార్యాలయంలో కౌన్సిలింగ్ రూమ్, మెడికల్ రూమ్, లీగల్ సపోర్ట్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్ మరియు రికార్డ్ లను తనిఖీ చేశారు. భరోసా కేంద్రం ప్రారంభమైన నాటి నుండి పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అందించిన సేవలను, నిర్వహించినకౌన్సిలింగ్, భరోసా సిబ్బంది నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార ఇతర మహిళా సంబంధిత కేసులలో భాదితులను హక్కు చేర్చుకుని వారిలో ధైర్యాన్ని నింపాలని అన్నారు. బాధిత మహిళలకు వెన్నంటి ఉండి వారికి అందించవలసిన మెడికో లీగల్ సేవలను సత్వరమే అందేలా చూడాలని అన్నారు. అవసరమైన కేసులలో హోమ్-విజిట్ చేసి కౌన్స్లింగ్ నిర్వహించాలని అన్నారు. మహిళా సంభందిత నేరాల గురించి వివిధ స్కూల్స్, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర ఉమెన్ సేఫ్టీ అంశాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. భరోసా సిబ్బంది పనితీరు బాగుందని, వారు అందించిన సేవలను అభినందిస్తూ డ్యూటీ పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ విజిటింగ్ నందు సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, భరోసా కో-ఆర్డినేటర్ దేవ లక్ష్మీ, భరోసా సిబ్బంది తదితరులు ఉన్నారు.


Similar News