మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ : ఎమ్మెల్యే సునీత రెడ్డి

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని నర్సాపూర్ నియోజకవర్గంలోని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు

Update: 2025-03-20 15:34 GMT
మత సామరస్యానికి  ప్రతీక ఇఫ్తార్  :  ఎమ్మెల్యే సునీత రెడ్డి
  • whatsapp icon

దిశ, నర్సాపూర్ : మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని నర్సాపూర్ నియోజకవర్గంలోని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సునీత రెడ్డి ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆమె మత పెద్దలకు పండ్లను తినిపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్ర గౌడ్, మన్సూర్, హరికృష్ణ నియోజకవర్గం లోని ఆయా మండలాలకు చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News