దిశ ఎఫెక్ట్ : పైప్ లైన్ పనులు షురూ

చౌటకూర్ మండలం కేంద్రంలో పైప్ లైన్ కోసం రోడ్డును తొవ్వేసి వదిలేయడంతో వాహనదారులకు ఇబ్బందులుగా ఉన్న అంశంపై ఈనెల 26న "రోడ్డు తవ్వేశారు పైప్ లైన్ వేయడం మరిచారు."

Update: 2025-03-27 14:26 GMT
దిశ ఎఫెక్ట్ : పైప్ లైన్ పనులు షురూ
  • whatsapp icon

దిశ, చౌటకూర్ :- చౌటకూర్ మండలం కేంద్రంలో పైప్ లైన్ కోసం రోడ్డును తొవ్వేసి వదిలేయడంతో వాహనదారులకు ఇబ్బందులుగా ఉన్న అంశంపై ఈనెల 26న "రోడ్డు తవ్వేశారు పైప్ లైన్ వేయడం మరిచారు." పేరిట దిశలో రిపోర్టర్ కథనం ప్రకారం ప్రచురితమైంది. దీనికి మండల అధికారులతో పాటు నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించారు. గురువారం స్థానిక ఎంపీడీవో శంకర్ ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో కొత్తగా పైప్ లైన్లను వేశారు. రాత్రి వరకు అల్లా మొత్తం పైప్ లైన్ తో పాటు దానిపైన రోడ్డు పని కూడా పూర్తి చేయాలని ఎంపీడీవో హిందుస్తానీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. 8 నెలలుగా తీరని సమస్యను దిశ వెలుగులోకి తేవడంతో ఆ పనులు చక చక పూర్తయిపోయాయి. దీంతో స్థానికులు దిశకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News