భార్య సంసారానికి రావడం లేదని భర్త సూసైడ్..
భార్య పుట్టింటికి వెళ్లిపోగా సంసారం కి రావడం లేదని మనస్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోతాంశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, చేగుంట : భార్య పుట్టింటికి వెళ్లిపోగా సంసారం కి రావడం లేదని మనస్థాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోతాంశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోతాం శెట్టిపల్లి గ్రామానికి చెందిన బండారి వేణుగోపాల్ ( 31 ) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం తన అవసరాల నిమిత్తం తన భార్య పుస్తెలతాడు కుదువ పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఈ విషయములో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య సంసారానికి రావడంలేదని మనస్థాపం చెందాడు. ఉదయం ఏడు గంటలు అయిన లేవకపోవడంతో అతని తల్లి బండారి సుగుణమ్మ రూమ్ వద్దకు వెళ్లి చూడగా చీరతో ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. మృతుని తల్లి బండారి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.