ఆస్తిపన్ను వసూళ్లపై నజర్..!

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్ల పై అధికారులు నజర్

Update: 2025-03-28 02:14 GMT
ఆస్తిపన్ను వసూళ్లపై నజర్..!
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్ల పై అధికారులు నజర్ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూలుకు మార్చి నెలాఖరు వరకు గడువును ప్రభుత్వం విధించింది. 100 శాతం వసూళ్లే లక్ష్యంగా అధికారులు లక్ష్యంగా పెట్టుకుని పన్ను వసూలుకు చర్యలు చేపట్టారు. మార్చి నెలాఖరు వరకు ఇది కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు బిల్ కలెక్టర్లను సైతం సస్పెండ్ చేశారు. పన్ను వసూలు చేయడంలో విఫలమయ్యారని కమిషనర్ కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం 62శాతం పన్ను వసూలు చేశారు. మరో 38 శాతం వసూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పన్ను వసూళ్లకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. కానీ, పన్ను వసూలుకు 31వ తేదీ వరకూ గడువు ఉన్నా, అందులో 30, 31వ తేదీలు సెలవు వచ్చింది. ఇక మిగిలింది మరో రెండు రోజులు గడువు ఉన్నది. ఇక ఈ రెండు రోజుల్లో 100 శాతం పన్ను వసూలు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందశాతం శాతం పన్ను వసూలు చేసేందుకు, ప్రజల నుంచి సరియైన స్పందన లేక పోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.

ఆస్తిపన్ను వసూళ్లపై నజర్..!

సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.14 కోట్ల 22 లక్షల 34 వేలు ఉంది. ఇదిలా ఉంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎర్లీ బర్డ్ స్కీం (ఆస్తి పన్నుపై 5శాతం రాయితీ)లో సుమారు 45 శాతం ఆస్తి పన్ను వసూలైంది. 2025 మార్చి 27 నాటికి రూ.9 కోట్ల 12 లక్షల 17వేల (62శాతం) ఆస్తి పన్ను వసూలు అయినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరు లోగా మరో రూ.5 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. మొండి బకాయిదారులకు పన్ను వడ్డీ పై 90శాతం రాయితీ ఇవ్వడంతో అధికారులు మొండి బకాయిలపై దృష్టి సారించారు. మున్సిపల్ ఆదాయ వనరుల్లో పన్నుల వసూల్లే కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బడ్జెట్ లేమి కారణంగా ఆస్తి పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉంటాయి. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసముండే, వారి ఇంటి పన్ను బకాయిలు వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వంద శాతం పన్ను వసూళ్లు ధ్యేయంగా అధికారుల ప్రయత్నం ఏ మేర సత్ఫలితాలనిస్తోందో తెలియాలంటే మార్చి నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే.

Similar News