సంగారెడ్డిలో యువకుడు అదృశ్యం.. 12 రోజులైన కానరాని జాడ

సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. నేటికీ 12 రోజులు గడుస్తున్న అతని జాడ తెలిసి రాలేదు.

Update: 2025-03-20 14:35 GMT
సంగారెడ్డిలో యువకుడు అదృశ్యం.. 12 రోజులైన కానరాని జాడ
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. నేటికీ 12 రోజులు గడుస్తున్న అతని జాడ తెలిసి రాలేదు. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కింది బజారుకు చెందిన చించోలి అరుణ్ (27) ఎలాంటి పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. కాగా ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి నేటికి తిరిగి రాలేదు. అయితే అరుణ్ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ 8790800117కి ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో అతడి తల్లిదండ్రులు భారతి, లక్ష్మణులు పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్ 8712661830 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ సూచించారు.


Similar News