అంగరంగ వైభవంగా హంస వాహన సేవ..

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరన్న

Update: 2025-03-22 02:59 GMT
అంగరంగ వైభవంగా హంస వాహన సేవ..
  • whatsapp icon

దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరన్న గూడెం లోని ప్రసిద్ధ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం హంస వాహనంపై స్వామివారి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఆలయ ప్రాంగణం భజనలు, మంగళవాద్యాలతో మారుమోగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హారతులు సమర్పించగా, భక్తులు సత్సంగం, భజనలు నిర్వహించి తమ ఆరాధనను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, పర్యవేక్షకులు సోమయ్య, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్రతం దారులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News