ఇఫ్తార్ విందులతో స్నేహభావం పెంపొందుతుంది : కలెక్టర్

ఇఫ్తార్ విందుతో సోదర భావం పెంపొందిస్తుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో టి జి టి ఏ & టి జి ఆర్ ఎస్ ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా

Update: 2025-03-25 15:25 GMT
ఇఫ్తార్ విందులతో స్నేహభావం పెంపొందుతుంది : కలెక్టర్
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి : ఇఫ్తార్ విందుతో సోదర భావం పెంపొందిస్తుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో టి జి టి ఏ & టి జి ఆర్ ఎస్ ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అల్లా దయతో అందరూ సుఖశాంతులతో,సహోదర భావంతో మెలగాలని ఆకాక్షించారు. ఇఫ్తార్ విందు తో ఉద్యోగుల్లో స్నేహభావం పొందుతుందన్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. అల్లా కృప అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టి జి టి ఏ అధ్యక్షురాలు షేక్ హసీనా, జనరల్ సెక్రటరీ నజీమ్ ఖాన్ , టి జి ఆర్ ఎస్ ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి.హేమంత్, కలెక్టరేట్ ఏ. ఓ. పరమేష్ ,అందోల్ తహసీల్దార్ విష్ణుసాగర్ , జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్, జనరల్ సెక్రటరీ సీహెచ్. ప్రవీణ్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో కలెక్టరేట్లోని వివిధ శాఖలకు చెందిన ముస్లిం మైనారిటీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News