శ్రీ నల్లపోచమ్మ హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..?

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శ్రీ నల్లపోచమ్మ హుండీ ఆదాయం రూ .6 లక్షల74 వేల 73 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి రంగారావు తెలిపారు.

Update: 2025-03-26 16:15 GMT
శ్రీ నల్లపోచమ్మ హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..?
  • whatsapp icon

 దిశ, కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శ్రీ నల్లపోచమ్మ హుండీ ఆదాయం రూ .6 లక్షల74 వేల 73 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి రంగారావు తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏడుపాయల ఈవో,ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రెడ్డి, సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ ( రెనోవేషన్) చైర్మన్ తాళ్ళ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు అంబూరి సునీత, తాళ్ల నారాయణ రెడ్డి, రాములు, పర్వతాలు యాదవ్, వడ్ల ప్రభాకర్ చారీ, శంకర్ గౌడ్, పంబల కృష్ణ, మహేందర్, బిక్షపతి, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి కామారెడ్డి కో ఆర్డినేటర్ సునీతారెడ్డి నేతృత్వంలో.. మహిళా సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి పేర బ్యాంకులో డిపాజిట్ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని ఈవో రంగారావు తెలిపారు.

Similar News